సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.